సర్పంచ్ మారెళ్ళ మమత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం..

Published: Thursday March 09, 2023
తల్లాడ, మార్చి 8 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ఆధ్వర్యంలో బుధవారం మహిళ దినోత్సవాన్ని గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి హాజరై గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమతను శాలువాలతో సన్మానించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సర్పంచ్ సేవలను పలువురు కొనియాడారు. అదేవిధంగా హెచ్ఎం సరోజిని, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో సెక్రెటరీ పి.వేణు, గ్రామస్తులు పాల్గొన్నారు.* 
 
 *సర్పంచ్ మారెళ్ళ మమతకు సన్మానం..* 
 
 *అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ మారేళ్ల మమతను స్కూల్ యాజమాన్యం శాలువాలతో సత్కరించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రమేష్, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, విద్యార్థులు పాల్గొన్నారు.*