రియల్ వ్యాపారుల చేతుల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని నెర్రపల్లి గ్రామస్

Published: Wednesday July 13, 2022
ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 113 లో ప్రభుత్వ భూమి 3.08 మూడు ఎకరాల 8కుంటల భూమి ఉండడం జరిగింది. ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా పౌర అవసరాల కోసం ఉపయోగించాలని గ్రామస్తులు మనవి చేశారు. అట్టి భూమిని గోకుల్ వెంచర్ వారు అక్రమంగా రియల్ దందా పేరుతో ప్రభుత్వానికి చెందిన భూమిని కబ్జా చేసి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు.ఇటీవల కాలంలో క్రీడా ప్రాంగణం కోసం మండల్ సర్వేయర్ 113 సర్వే నంబర్ గ్రామపంచాయతీ వీఆర్ఏ కారోబార్, ఉప సర్పంచ్ పర్యవేక్షణలో జరిగిందని అప్పుడు 113 సర్వే నెంబర్లో 3.08 మూడు ఎకరాల 8గుంటలు కబ్జాకు గురైందని తెలిసింది. కావున కబ్జాకు గురైన భూమిని సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కి ఎండిఓ కి నెర్ర పల్లి గ్రామస్తులు దరఖాస్తు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గుత్తు రాజశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, జగన్ రెడ్డి, శ్రీహరి, జి జంగారెడ్డి, నాగరాజు, బాల్ రెడ్డి, శరత్ రెడ్డి, కుమార్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.