డెంగీ, మలేరియాను అరికడదాం : ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి

Published: Tuesday June 29, 2021
మధిర, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : అంతర్జాతీయమలేరియా వ్యతిరేక దినోత్సవాల్లో భాగంగా కరపత్రాల విడుద ఈరోజు మధిర మండలo లో phc దెందుకూరు పరిధిలొని దేశినేనిపాలెంగ్రామoలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా మలేరియా కంట్రోల్ అధికారులు సూచనల మేరకు మధిర మండలంలో phc మాటూరు పేట phc దెందుకూరు పరిధిలొని అన్ని గ్రామాల్లో Phc దెందుకూరు dr వెంకటేష్ dr పుష్పలత సలహా మేరకు డెంగ్యూ మలేరియా నివారణకు ప్రజల్లో అవగాహన నిమిత్తం కరపత్రాలు, బ్యానర్స్, ప్లిప్ చార్ట్ లను ఈ రోజు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్ ఆరోగ్య పరివేక్షకుడు లంకా కొండయ్య చేతులు మీదుగా విడుదల చేసినారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షా కాలం కనుక దోమలు పుట్టకుండా దోమలు కుట్ట కుండా ప్రతి ఒక్కరుపరిసరాల పారిశుధ్యo పాటించాలని సూచనలు ఇచ్చారు. అనంతరo గ్రామంలో నర్సరీ కంపోస్ట్ షెడ్డు పరిశీలించారు. రాయపట్నం గ్రామంలో గ్రామ సభ లో పాల్గొన్నారు. అదేవిదంగా రాయపట్నం బీసీ కాలనీలో anm బృందం చేస్తున్న అవుట్ రిచ్ కరోనా టెస్ట్ లు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సెక్రటరీలు శ్రీ విద్య స్వాతి రెడ్డి anm విజయకుమారి ఆశలు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.