సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*

Published: Monday August 22, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 21, ప్రజాపాలన : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం రోజున  మంచిర్యాల పట్టణంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు  చేశారు. ఈ సంద్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య,  కో కన్వీనర్ నీరేటి రాజన్న లు మాట్లాడుతూ సింగరేణిలో రోజు రోజుకి ప్రవేటికరణ వేగవంతం అవుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కార్మిక బ్రతుకులు బాగుపడతాయని కొత్త హక్కులొస్తాయనే ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో 44 రోజులు సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటుకు తోడుపడిన సింగరేణి కార్మిక వర్గానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నూతనంగా ఒక హక్కు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు, ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ ఒక్కొక్కటిగా హరించుకు పోతున్నాయి. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల పట్టణ ప్రాంతాలలో ప్రతి కార్మికునికి ఇంటి స్థలాలతో పాటు 10 లక్షల రూపాయలు, వడ్డీ లేని రుణం ఇస్తామని, సింగరేణి ప్రాంతంలో 50 భూగర్భను లు తీసి లక్ష యాభై వేల మంది కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకుంటానని,  ఓపెన్ కాస్ట్ గనులను పూర్తిగా రద్దు చేస్తామని ఎలాంటి దోపిడీ లేకుండా ప్రతి కార్మికుడు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుని కుమారుడికి  వారసత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం,     ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన తెలంగాణ జన సమితి, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, సింగరేణిలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో గోలేటి నుండి  కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు బాయ్ టు బాయ్  జాతర ప్రోగ్రాం ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవి సత్యం,
గోడిసెల శ్రీహరి, ఎం.ఎఫ్ బేగ్ , దాసరి జనార్ధ,న్ కాసర్ల ప్రసాద్ రెడ్డి ,వెంగళ కనకయ్య , జైపాల్ సింగ్ , పురం శెట్టి శ్రీధర్,  మాదరబోయిన వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.