ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు రాస్తారోకో

Published: Wednesday November 24, 2021
హైదరాబాద్ 23 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : మెదక్ పట్టణంలో హైదరాబాద్ వెల్లే రోడ్డుపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు మంగళవారం నాడు ఉదయం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కల్లాల వద్ద గత కొన్ని రోజులుగా రాత్రుల్లు కావలి కాయడం తేమ శాతం తగ్గించడానికి ధాన్యాన్ని రోజు ఎండబెట్టడం కూలి ఖర్చు ఎంతో ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తా రోకోతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. తరువాత పోలీస్ లు స్పందించి ధర్నా చేస్తున్న రైతులతో సంప్రదించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగిందన్నారు.