మధిర డాక్టర్లకు నెలరోజులపాటు డిప్యుటేషన్ రద్దు

Published: Thursday April 29, 2021
మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ గారు, డి ఎం హెచ్ ఓ మాలతీ గార్ల తో మాట్లాడి డిప్యుటేషన్ రద్దు చేయించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ అనిల్ కుమార్ డిప్యుటేషన్ను నెలరోజులపాటు రద్దు చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, డీఎంహెచ్ఓ మాలతితో మాట్లాడి మధిర డాక్టర్ల డిప్యుటేషన్ నెల రోజుల పాటు రద్దు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.