ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Tuesday March 09, 2021
మేడిపల్లి, మార్చి8 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర హోలియా దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టంటం వీరేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అరటికాయల శాలినీ భాస్కర్, రాణి రెడ్డి, జీనత్ బేగం, అన్ రెడ్డి పద్మ, సుచరిత, అవుశెట్టి పద్మ, జివి.లక్ష్మి, అరుణలు పాల్గొన్నారు. సంఘం తరుపున మహిళలను పెద్ద ఎత్తున వారిని గౌరవించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, ఉపాధ్యక్షుడు టంటం అంబదాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనగొంది జంగయ్య, టేకుమట్ల వినోద్, కోశాధికారి రెండ్ల శంకర్, టేకుమట్ల బాలరాజు, అత్తూరు అనంతస్వామి, టంటం రఘు తదితరులు పాల్గొన్నారు.