మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలి

Published: Saturday October 15, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 అక్టోబర్ ప్రజా పాలన : ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరములో ప్రపంచ ఆహార దినోత్సవం -2022 సందర్బంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, ఆహార కొరత లేకుండా ప్రతి ఒక్కరికి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు.  ఏ ఒక్క పౌరుడు ఆకలితో ఉండవద్దనే ఉద్యేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు.  ఆహారం దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని, దాని విలువను గుర్తించలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు భవిష్యత్ లో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఆహార భద్రత చట్టంపై రేషన్ డీలర్లకు, రేషన్ కార్డు లబ్ధిదారులకు, అంగన్వాడీ టీచర్లు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.  అనంతరం ప్రపంచ ఆహార దినోత్సవంపై పాఠశాల విద్యార్థులు, పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన వ్రకృత్వ, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, ఆర్ డి ఓ విజయకుమారి, రేషన్ డీలర్లు, రేషన్ కార్డు లబ్ధిదారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.