తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలి : ఎమ్మార్పీఎస్

Published: Thursday March 25, 2021
జగిత్యాల, మర్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం ఆవరణలో విలేకరుల సమావేశంలో జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమాల గంగారం మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 - 2022 బడ్జెట్ సమావేశంలో దళితులకు 26 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మందకృష్ణ మాదిగ గత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం  పల్లె ప్రగతి పేరుతో ఎస్టి ఎస్సిల దళితుల భూములను లాక్కోవడం వలన భూములు కోల్పోతున్న బాధితుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ భూములు కోల్పోతున్నటువంటి వారికి అండగా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల్లో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ భూపంపిణీ అమలు చేయకుండ ఉన్న భూములను బలవంతంగా లాక్కోవడంన్నీ నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మూడెకరాల భూమి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ 58 సంవత్సరాల నుండి 61 కి పెంచడం వలన నిరుద్యోగ యువతను పెంచి పోషించడమే అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పడిగెల మల్లయ్యమాదిగ  దుమాలపెద్ద  గంగారాం మాదిగ  మీసాల సాయిలు మాదిగ బొల్లె అనిల్ మాదిగ ప్రవీణ్ మాదిగ రాజేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.