జగిత్యాల ఖిల్లాలో మువ్వన్నెల జెండాను ఎగరేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Monday August 16, 2021
జగిత్యాల, ఆగష్టు 15 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లాలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు ప్రజా కుల సంఘాలు యూనియన్ ఆఫీస్ లు ప్రెస్ క్లబ్ రాజకీయ పార్టీ కార్యాలయాల్లో తదితర చోట్ల మువ్వన్నెల జెండాలు రేపరేపాలాడాయి. జగిత్యాల ఖిల్లాలోని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మువ్వన్నెల జెండాను ఎగరేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రవి గుగులోత్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావా వసంత ఎస్పీ కార్యాలయంలో సింధూశర్మ అడిషనల్ ఎస్పీ సురేష్ డిపీవో కార్యాలయంలో పల్లికొండ నరేష్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సురేష్ డిఎఫ్ఓ కార్యాలయంలో వెంకటేశ్వర్ రావు డిఎస్పీ ఆఫీసులో వెంకటరమణ ఆర్డీఓ కార్యాలయంలో దుర్గమాధురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్పర్సన్ భోగ శ్రావణి జిల్లా గ్రంధాలయ కార్యాలయంలో చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ ఏఎంసి చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ క్లబ్ లో చీటీ శ్రీనివాస్ టౌన్ సిఐ రూరల్ సీఐ కార్యాలయాల్లో సీఐ లు కిషోర్ కృష్ణ కుమార్ రూరల్ పీఎస్ లో ఎస్సై చిరంజీవి ట్రాఫిక్ పీఎస్ లో ఎస్సై నవతా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ సుధాక్షిణదేవి బస్ డిపోలో డిఎం జగదీశ్వర్ డిఈఓ హాస్టళ్ళు ప్రయివేటు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు తదితర కార్యాలయాల్లో యూనియన్ ఆఫీసుల్లో జెండా వందనం కార్యక్రమాలు నిర్వహించారు. ఖిలాలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా చిన్నారుల ప్రదర్శనలు అహుతులను ఆకట్టుకున్నాయి. మూడు సంవత్సరాల చిన్నారి తాటిపర్తి అక్షా రెడ్డి "జెండా ఉంచా రహే హమారా" అంటూ జాతీయజేండాను పట్టుకొని దేశ భక్తిని చాటిచెప్పే విధంగా విన్యాసం చేయడం అందరిని ఆకర్శించింది. జిల్లా వ్యాప్తంగా జెండా పండుగను వాడవాడల ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గొడిసెల రాజేశం గౌడ్ జడ్పీటీసీలు ఎంపీపీలు ప్యాక్స్ చైర్మలు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.