సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం 6 వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Published: Thursday November 10, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 09, ప్రజాపాలన : సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం 6 వ రాష్ట్ర మహాసభల పోస్టర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయంలో బుధవారం రోజున   విడుదల చేశారు. ఈ సందర్భంగా  సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి  మధు మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలోని ప్రభుత్వ రంగా సంస్థలను అతి తక్కువకు భడా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడి దారులకు అమ్ముతున్నారని. అంతే కాకుండా కార్మికుల హక్కులను కాలేరాసే విధంగా ఉన్న రక్షణ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకొస్తున్నారు.ఈ చట్టాలను రద్దు చేయాలని , అదే విదంగా తెలంగాణలో కొత్తగా బొగ్గు బావులు తీయాలని , స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర 6 వ మహాసభలు శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో  నవంబర్ 26, 27 తేదిలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విధానాలపై ఈ మహాసభలో చర్చించి , రాబోయే కాలంలో పోరాటాలను రూపాకల్పన  చేస్తాం అని అన్నారు.    జిల్లాలోని  అన్ని రకాల కార్మికులు, ప్రజలు, మేధావులు, ప్రముఖులు, అందరు పాల్గొని మహాసభలను  విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం బెల్లంపల్లి రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు దూలం శ్రీనివాస్, కుమారి తదితరులు పాల్గొన్నారు.