గ్రామ అభివృద్ధికై నేను సైతం: ఆళ్ల మోహనరావు

Published: Thursday September 30, 2021

బోనకల్, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండలం పెద్దబీరవల్లి గ్రామంలో సర్పంచ్ ఆళ్ళ మోహన్ రావు కరోనా సమయంలో పాజిటివ్ వచ్చిన కుంటుంబీ సభ్యులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఎదుటి వారికి సహాయ పడాలి అనే ఒక గొప్ప మనస్సుతో వారి యొక్క ఆరోగ్యం పుష్టిగా ఉండాలని గుడ్లు, పాలు, మాసం అందిస్తూ తన మానవత్వం చాటుతూ గ్రామ అభివృద్ధిలో నేను సైతం అంటూ తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నాడు. అలాగే ట్యాంక్ బజార్ మొత్తం ముళ్లపొదలు, గుంతలతో నిండి ఉండటం చేత నిత్యం ఎంతో మంది ప్రయాణికులు అటుగా ప్రయాణం సాగిస్తూ అనేక ఇబ్బంద్దులు పడుతూ ఉండేవారు. అది చూసిన సర్పంచ్ బుధవారం వ్యక్తిగతంగా జేసీబీ ఏర్పాటు చేసి కంప పొదలు, గుంతలు పూడ్చివేసే కార్యక్రమం చేపట్టారు. అది చూసి స్థానిక ప్రజలు సర్పంచ్ఆళ్ళ మోహన్ రావును వారు చేసిన మంచి పనికి కృతజ్ఞతలు తెలియజేశారు.