రైతన్నకు అండగా రైతు బీమా

Published: Tuesday August 10, 2021
రైతు బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న సమున్నత లక్ష్యం తో దేశంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం గ్రామానికి చెందిన డప్పు నర్సింలు అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. రైతు బీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును గురువారం ఎమ్మెల్యే నివాసంలో వారి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బీమా రైతులకు కొండంత దీమా అందిస్తోందని అన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు సైతం రైతు బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నిఖిల్ గౌడ్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రేమ్ నాయకులు జీవన్, రమేష్, పవన్, రాము తదితరులు పాల్గొన్నారు.