సింగరేణి సంస్థ వల్లే ఈ స్థాయిలో ఉన్నాము ...సంతోషంలో రిటైర్డ్ కార్మికులు

Published: Friday September 02, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి సంస్థ తల్లి ఒడిలో పనిచేయడం వల్లనే మా పిల్లలు, మేము, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నామని, లేకపోతే మా బ్రతుకులు ఎలా ఉండేవో వెనక్కి వెళ్లి ఆలోచి స్తే అలాంటి బాధలు పగవాడికి కూడా రావద్దని పలువురు పదవి విరమణ పొందిన కార్మికులు అన్నారు. మందమరి ఏరియాలో ని శాంతిఖని  గనిపై బుధవారం ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పలువురు పదవి విరమణ పొందిన కార్మికులు మాట్లాడారు, గత 30 సంవత్సరాల క్రితం సింగరేణి సంస్థలో మామూలు కార్మికులుగా చేరిన మేము అంచలంచలుగా ప్రమోషన్లు పొందుతూ, మా పిల్లలను ఉన్నత చదువులు చదివించగా, వారు ప్రస్తుతం విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉండడం, మా కుటుంబ సభ్యులకు, సింగరేణి సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ సర్వీసుల్లోనూ ఉన్నత, ఉద్యోగాలు చేస్ స్తూన్నారని , మరికొంతమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పిల్లలు చదివి ఇదే సింగరేణి సంస్థలు పనిచేస్తుండడం మాకు ఎంతో గర్వంగా ఉందని వారన్నారు.
ప్రతి కార్మికుడు వారి పిల్లల్ని మాకు లాగే ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థితిలో ఉండాలని, సంస్థకు మన కుటుంబాలకు మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నించాలని, వారు కార్మికులకు బోధించారు.
అనంతరం గని పై పదవి విరమణ పొందిన ఆఫీస్ సూపర్డెంట్ నాగరాజు గోపాల్, గంటేల అంజయ్య, పోషం,లను  సంస్థ పరంగా అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించి, సంస్థ ఇచ్చే గిఫ్టులను అందించి, వారికి రావలసిన బెనిఫిట్స్ ఎంత వస్తున్నాయో, పెన్షన్లు ఎంత రాబోతుందో ,అనే విషయాలను తెలిపి వాటికి సంబంధించిన చెక్కులను అందించారు.
ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, ప్రవీణ్ యువసేన నాయకులు, అన్ని యూనియన్ల నాయకులు, కార్యకర్తలు, పాల్గొని శాలువాలతో వారిని ఘనంగా సన్మానించారు.