అట్టహాసంగా సేవాలాల్ మహారాజ్ జెండా పండుగ ఉత్సవాలు

Published: Monday August 23, 2021
బోనకల్లు, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్, మండల కేంద్రంలోని స్థానిక గిరిజన కాలనీలో శ్రీ మేరమ్మ తల్లి, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జెండా పండుగను కనులవిందుగా జరుపుకున్నారు, గ్రామ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, కార్మికులు కర్షకులు, రైతులు మరియు వివిధ వృత్తి వ్యాపారస్తులు వారి రంగాల్లో బాగా రాణించారని, గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలందరూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సైదా నాయక్, వైస్ ఎంపీపీ రమేష్, ఎన్ఆర్ఐ బీజేపీ యువనేత బిపి నాయక్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ నాగేశ్వరరావు, జీకే మీడియా ప్రతినిధి శ్రీనివాస్, సేవాలాల్ మహారాజ్ సమితి సభ్యులు కిషోర్, రమేష్ నాయక్, గోపి, సైదా మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.