*ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం.*మధిర రూరల్ డిసెంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మం

Published: Wednesday January 04, 2023

దోమందుల సామ్యూల్ ఎలిజిబెత్ రాణి కుమారుడు వంశీకృష్ణ సుకన్య  పెళ్లిరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో మహోన్నతమైన అన్నదానం మరియు పండ్లు స్వీట్స్ కేకు అందజేశారు. కార్యక్రమంలో సరోజినీ విక్టోరియా పాస్టర్ పుల్లయ్య దోర్నాల మణీ నల్లమల ప్రకాష్ రావు ఎమ్మార్వో సూర్యాపేట ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమ నిత్య అన్నదాత జిల్లేపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం డైరెక్టర్ జ్యోతి ఆర్కే వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వంశీకృష్ణ సుకన్య  అభినందనలు తెలియజేస్తూ అన్నదానం నిర్వహించిన సామ్యూల్ ఎలిజిబెత్ రాణి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాతమాట్లాడుతూ ఈరోజు అన్నదాన చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ భగవంతుడు దీవెనలు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు