గొల్లపల్లి మండలంలో రంజాన్ కానుకలు పంపిణీచేసిన నేతలు

Published: Monday May 10, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలంలోని అన్ని గ్రామంలో ముస్లిం-మైనారిటీ ప్రజలకు అత్యంత పవిత్ర రంజాన్ మాస పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుక దుస్తులను  సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండల కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ అలీ తన స్వంత వాహనం లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని ప్రతి గ్రామంలో ఉన్నా ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగస్వామ్యంగా ఇబ్రహీంనగర్ గ్రామంలో ఏ ఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్ తో కలిసి పంపిణీ చేశారు. తిరుమలపురం (పీ.డీ)ఇబ్రహీంనగర్, బీబీరాజ్ పల్లి రాఘవపట్నం చిల్వకోడూర్ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులకు ఇబ్రహీంనగర్ గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ​ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంతోషమే ధ్యేయంగా సమన్వయ పాలన కొనసాగుతున్నది అని, ఇంతటి కరోనా కష్టకాలంలో సైతం ఆగని సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరు సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనం అని​ తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీ శాఖ ద్వారా ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికీ పెద్ద పీట వేసిందని అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో మొహమ్మద్ మహిముద్ ఖయ్యుమ్ ఇబ్రహీంనగర్ ముస్లిం నాయకులు బషిర్ సల్మాన్, సమీర్ రియాజ్ ముస్లిం పెద్దలు నాయకులు తదితరులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వనికి, సీఎం కేసీఆర్ కు సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.