హిందూ దేవతలను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన వ్యక్తిని పీడీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని

Published: Saturday December 31, 2022

రాయికల్, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): అయ్యప్ప మాల ధరించి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించే అయ్యప్ప స్వామిని దూషించడం,హిందూ దేవతలను అనుచిత వ్యాఖ్యలతో దూషించడం, అయ్యప్పస్వామి దీక్షాపరుల మనోభావాలను దెబ్బతీయడం హిందూ దేవతల చరిత్రపై అసభ్యంగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వరంగల్ కు చెందిన బైరి నరేష్ పై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అయ్యప్ప స్వామి మాలాదరణ భక్తులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు,హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున రాయికల్ పట్టణ కేంద్రంలో స్థానిక అయ్యప్ప ఆలయం నుండి బైకుల పై ర్యాలీ గా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు,హిందూ సంఘాల నాయకులు నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు అయ్యేంతవరకు ఉద్యమించాలన్నారు.