సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది మంత్రి చామకూర మల్లారెడ్డి

Published: Monday October 04, 2021
మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి) : సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోని ఇతర రాష్టలకు ఆదర్శంగా నిలిచిందని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు దసరా పండగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మేయర్  జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సెట్విన్ సెంటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి  పాల్గొని కార్పోరేషన్లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగ వరకు కొనసాగుతదని, ఫుడ్ సెక్యురిటి కార్డు ఉన్న ప్రతి మహిళ రేషన్ షాప్స్ వద్ద ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి బతుకమ్మ చీరను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కమిషనర్ కే. శ్రీనివాస్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, బొడిగే స్వాతి, కొల్తూరు మహేష్, బచ్చ రాజు, వీరమల్ల సుమలత, మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్, తుంకుంట్ల ప్రసన్న లక్ష్మీ, పాశం శశిరేఖ, బండారు మంజుల, కుర్ర షాలిని, అలువాల సరిత, కౌడే పోచయ్య, పిట్టల మల్లేష్, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎన్. మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి, కో- ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రా రెడ్డి, కుర్ర శ్రీకాంత్ గౌడ్, బండారు రవీందర్, పాశం బుచ్చి యాదవ్, తుంకుంట్ల శ్రీధర్ రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, బొడిగే కృష్ణా గౌడ్, యాసారం మహేష్, బైటింటి ఈశ్వర్ రెడ్డి, చెరుకు పెంటయ్య, జావిద్ ఖాన్, జయేందర్, రఘువర్ధన్ రెడ్డి, నిర్మల, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.