జ్యోతిబాపూలే గురుకులవిద్యార్థినుల ప్రతిభ అమోఘం

Published: Thursday November 25, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ సమీపంలో జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వం బాలికలకు అన్ని రకాల వసతులు సమ కూర్చబడ్డాయి. నాణ్యమైన విద్య తో పాటు క్రీడలు, సంగీత, సాహిత్యం, చిత్రలేఖనం తదితర అంశాలపై విద్యార్థులు తమ దైన శైలిలో ప్రతిభ కనబరుస్తూ విద్యాలయానికి వన్నె తెస్తున్నారు. ఇందులో భాగంగా కమ్మరి వైష్ణవి 9వ తరగతి సింగింగ్ లో కళా ఉత్సవ్ లో పాల్గొని మెమొంటో అందుకున్నారు. చౌదర్ పల్లి శ్వేత బ్యాండ్, మ్యూజిక్, ఫోక్ లో అదరగొడుతున్నందున ఎన్నో బహుమతులు వరించాయి. అదేవిధంగా ఉప్పల విదర్శిని చిత్రలేఖనంలో వివిధ కళాఖండాలను వేస్తూ చూపరులను అబ్బుర పరుస్తున్నారు. ఉపాధ్యాయినిల సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యం అవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజమణి మాట్లాడుతూ అన్ని రకాల వసతులు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే 800 మంది విద్యార్థినిలకు నాణ్యమైన విద్యను అందిస్తూ సమయానుగుణంగా యాక్టివిటీస్ పైన శిక్షణ ఇస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా శేరిగూడ మెయిన్ రోడ్డు నుండి జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు సౌకర్యం కల్పించాలని విద్యార్థినిల  తల్లిదండ్రులు కోరారు. ఈ పాఠశాలకు ప్రహరి గోడ లేక విద్యార్థినిలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది. దారి పొడవునా విద్యుత్ స్తంభాలు నిర్మించి వాటికి  విద్యుత్ బల్బులు ఏర్పాటుచేసి నట్లయితే సౌకర్యంగా ఉంటుంది. పాఠశాలకు ప్రహరీ లేనందున బాలికల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరిశీలించి ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు.