సంగారెడ్డి కన్సల్టెన్సీ ఇంజనీర్ల డైరీ ఆవిష్కరణ

Published: Wednesday February 09, 2022
హైదరాబాద్ 8 ఫిబ్రవరి ప్రజాపాలన: తెలంగాణ ఉపాధి హామీ పథకం (ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం) జిల్లా కన్సల్టెన్సీ  ఇంజనీర్ల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ ఈజీఎస్ జిల్లా కన్సల్టెన్సీ ఇంజనీర్ల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, డి.ఆర్.డి.ఎ. పిడి శ్రీనివాసరావు మరియు అడిషనల్ పిడి ఆద్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కన్సల్టెన్సీ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.ఉదయ్ కుమార్ తో పాటు వివిధ మండలాలకు చెందిన ఇసి లు పాల్గొన్నారు.