గోదావరి వరద బాధితుల ర్యాలీ, గోదావరిలో జల దీక్ష విజయవంతం. బూర్గంపాడు ( ప్రజా పాలన.)

Published: Monday December 19, 2022
.భద్రాద్రికొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లో గోదావరి వరద బాధితులు భారీ ర్యాలీ  నిర్వహించారు.అనంతరం గోదావరి నదిలో జలదీక్ష నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
2022 జూలై 17న ముఖ్యమంత్రి బాధితులకు ఇచ్చిన శాశ్వత పరిష్కారం  హామీని వెంటనే నెరవేర్చాలని  డిమాండ్ చేశారు. బూర్గంపహాడ్ మండలం సారపాక ,కృష్ణ సాగర్ పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ భూమిని శాశ్వత ఇంటి స్థలాలకు కేటాయించాలని, పినపాక ,భద్రాచలం నియోజకవర్గంలోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్ రూం  కట్టించాలని దీక్ష లో  కోరారు.
రెవిన్యూ ,ఫారెస్ట్ భూముల  మధ్య సరిహద్దులను నిర్ణయించాలన్నారు.  సొంత స్థలం ఉన్నవారికి 3లక్షలు ఆర్థిక సహకారం హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు .ఈ యొక్క నిరసన కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మద్దతు తెలియ చేసినది.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలి సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ హుక్లా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, నాయకులు డి పున్నంచంద్, జక్కం కొండలరావు, నిరుపేదల గృహకల్ప సాధన కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొండపనేని కృష్ణయ్య, గోదావరి ముంపు వరద బాధితుల పోరాట కమిటీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, భూలక్ష్మి, ఎట్టి లక్ష్మణ్, సుజాత, భద్రమ్మ, అనంతలక్ష్మి,ధనసూరి అనసూయమ్మ, తాళ్లూరి తయారమ్మ  తదితరులు పాల్గొన్నారు.