కరోనా కష్టం కాలంలో అండగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు

Published: Monday July 05, 2021

బోనకల్, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : సామాజిక సేవ లక్ష్యంగా కరోనా మొదటి వేవ్ ప్రారంభం అయినప్పటి నుండి నేటివరకు కరోనా బాధితుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్న మేటి ఉపాధ్యాయుడు గుగులోతు. రామకృష్ణ, బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన రామకృష్ణ. కరోనా మొదటి వేవేలో ఉచిత హోమియో మందులుఈ పంపిణీ చేయడం జరిగింది. కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలనుచైతన్యం చేయడం జరిగింది. మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా ను కట్టడి చేయడంలో ప్రధాన భూమిక ‌వహిస్తున్న రక్షకభటులను సన్మానించడం జరిగింది తన బామ్మర్ది డాక్టర్ కేశవ నాయక్ సహకారంతో ఎంతో మందికి కి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు మరియు ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కరోనా బారిన పడి చనిపోయిన భాణోతు స్వాతి అంత్యక్రియలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ, మండల ఉపాధ్యాయుల చేయూత తో 10,000 పదివేలు విలువచేసే నిత్యావసర వస్తువులను ఖమ్మంలోని వికలాంగులకు పంపిణీ చేయడం జరిగింది కరోనా సెకండ్ వేవే లొ అందించిన సామాజిక కార్యక్రమాలు కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య యాప్ లో ఎంతోమందికి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ఉచితంగా చేయడం జరిగింది. తను సొంతంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి డాక్టర్ కేశవ్ నాయక్, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్రీకాంత్ గారిచే సలహాలు, సూచనలు ఇప్పించడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపో రాదని ధ్రుడ సంకల్పంతో తాను జన్మించిన రావినూతల గ్రామానికి తన స్నేహితులు, గ్రామ పెద్దలు ఉపాధ్యాయ మిత్రులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారంతో గ్రామ పెద్దల అందరిని కలుపుకుని కరోనా బారిన పడి తీవ్ర మనోవేదనకు గురి అవుతున్న ప్రతి ఒక గడపను సందర్శించి వారికి మనోధైర్యం ఇవ్వటంతో పాటు చికెన్, పండ్లు, కూరగాయలు, రాగి జావా పంపిణీ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్కు పేస్ ఫీల్డ్, మాస్క్ లు, శానిటేజ్రర్లు పంపిణీ చేయడం జరిగింది బోనకల్ మండల ఉపాధ్యాయులు టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఇచ్చిన సహకారంతో 44 వేల రూపాయలను బోడేపూడి ఐసోలేషన్ కేంద్రానికి అందించడంలో చురుకైన పాత్రను పోషించడం జరిగింది. కరోనా బాధితుల రోజువారి ప్రోగ్రెస్ ను తెలుసుకుంటూ డాక్టర్ శ్రీకాంత్ గారిచే వారికి సలహాలు సూచనలు ఇప్పించడం జరిగింది. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండొచ్చని ప్రజల్లో చైతన్యం కల్పించడం జరిగింది, డాక్టర్ శ్రీకాంత్ గారి కోరిక మేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారి సహకారంతో చేతనపౌండేషన్ ద్వారాబోనకల్ పి హెచ్ సి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ను ఇప్పించడం జరిగింది. గ్రామంలోని యువజనుల ను చైతన్యపరిచి కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయడం జరిగింది. బోనకల్ మండల కేంద్రంలో కరోనా టెస్ట్ కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం అల్పాహార పంపిణీ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ సహకారంతో పాలు పంచుకోవడం జరిగింది, టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ చేయూతతో మానసిక వికలాంగుల కేంద్రం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.