నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Published: Monday December 20, 2021
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 19, ప్రజాపాలన : జిల్లాలోని రైన్ మిల్లర్లు సరఫరాకు నిర్దేశించిన లక్ష్యాలను నకాలంలో పూర్తి స్థాయిలో చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. ఆదివారం జిల్లాలోని హాజీపూర్ మండలం నబ్బెపల్లిలో గల ఎన్.ఆర్.ఎం. ఇండస్ట్రీన్, శ్రీనివాన్ లక్ష్మీ ఆగ్రో ఇండ్రస్ట్రీన్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రా రైన్, బాయిల్డ్ రైన్ పెండింగ్లో ఉన్న లక్ష్యాలను సంబంధిత రైన్ మిల్లర్లు నకాలంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా 24 గం||ల పాటు రైనిమిల్లులు నడిపించాలని తెలిపారు. లోడింగ్, అన్ లోడింగ్ విషయంలో రైన్ మిల్లుల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం సూచించిన మేరకు యాసంగిలో వరిధాన్యం సాగు మినహా వాణిజ్య, ఆరుతడి, కూరగాయలు లాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి లాభం పొందేలా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం, తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.