పూజలు చేసిన జోనల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి..

Published: Saturday October 08, 2022
తల్లాడ, అక్టోబర్ 7 (ప్రజా పాలన న్యూస్):
 
తల్లాడ పట్టణంలోని యాచవరపు బజారు(రెడ్డీస్) లో బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారితో పాటు బతుకమ్మలను వినూత్న రీతిలో హంస వాహనంపై ఊరేగించారు. హంస వాహనం కొత్తదనంలో ఉండటంతో చూపరులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో యాచవరపు వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, జోష్ణ, కవిత, శైలు, శ్రీలత, సిరి, తదితరులు పాల్గొన్నారు.