పీర్జాదిగూడ కార్పొరేషన్ సర్వసభ్య

Published: Saturday January 21, 2023
సమావేశంలో 22 అంశాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం 
మేడిపల్లి, జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 22 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షన్- 2022 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2 కోట్లను సానిటేషన్ విభాగానికి అవసరమైన 5 స్వచ్చ ఆటోలు సుమారు రూ43 లక్షలు, వార్డ్ వారీగా రూ 10 లక్షలతో కంపోస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, రూ 50 లక్షలతో డియర్ సిసి సెంటర్ ను అభివృద్ధి చేయడం, రూ40 లక్షలతో 1 జేసీబీ కొనుగోలు, రూ 6 లక్షలతో రెండు ట్రిప్పింగ్ ట్రాలీల కొనుగోలు,రూ15 లక్షలతో 2 ట్రాక్టర్లు, రూ10లక్షలతో సమీకృత వ్యర్ధ పదార్ధాల శుద్దీకరణ పార్క్ యందు స్వచ్చ ఆటోలు జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించుటకు అవసరమైన కమాండ్ కంట్రోల్ సెంటర్  పూర్తి స్థాయిలో అదునీకరించడం. అలాగే స్వచ్ఛ వాలంటీర్లకు గౌరవ వేతనం అందించుటకు రూ26 లక్షలకు కేటాయిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది.తాగునీటి నమస్య లేకుండా క్రమంతప్పకుండ మంచినీరు సరఫరా చేసి, అవసరమైన చోట కొత్త పైప్ లైన్ తో పాటు జంక్షన్ నిర్మించడం.వీధి వ్యాపారులకోసం ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న "స్ట్రీట్ వెండింగ్ జోన్ " త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందించడం.
దోమల నివారణకు అవసరమైన కొత్త ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయడం. అలాగే చెరువుల చుట్టు ఉన్న కాలానీలతో అదనంగా ఫాగింగ్ చేసే విధంగా సభ్యులు కోరడం జరిగింది.
ప్రజల మానిసిక, శారీరక దృఢత్వం కోసం వివిధ డివిజన్లలో అవసరమైన చోట ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం.
పలు డివిజన్లలో అవసమైన చోట కరెంట్ స్తంబాలను  ఏర్పాటు చేయవలసిందిగా సభ్యులు విద్యుత్ అధికారులను అడగడంతో పట్టణ ప్రగతి  నిధులు మంజూరైనా వెంటనే వాటిని విద్యుత్ స్తంబాలతో పాటు ఇంటర్ పోల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.వివిధ కాలానీలలో రోడ్డు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తక్షణమే వాటిని మరమ్మత్తు చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.కుక్కల, పందుల, కోతుల నివారణకు అవలంభించాల్సిన ప్రణాళిక సిద్ధం చేయడం. ఓపెన్ నాలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే వాటికి ప్రహరీ గోడ నిర్మాణం చేయవలసిందిగా అధికారులను సూచించడం జరిగింది.ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ డా. పి రామకృష్ణ రావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కొ ఆప్షన్ సభ్యులు,మున్సిపల్,రెవిన్యూ, జలమండలి అధికారులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.