జర్నలిస్టుల సమస్యలపై దశలవారి ఆందోళన.

Published: Tuesday September 14, 2021
-ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శన- టీడబ్ల్యూజేఎఫ్
హైదరాబాద్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన: జర్నలిస్టుల సమస్యలపై దశలవారి ఆందోళన అంటూ పత్రిక ప్రకటన చేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్). జర్నలిస్టుల దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. తొలుత ఈ నెల 20న జర్నలిస్టుల డిమాండ్స్ డే పాటిస్తూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశం తీర్మానించింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య నివేదిక ప్రవేశపెట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరింపజేయాలని కోరుతూ ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు ఆయా జిల్లా, నియోజకవర్గాలలో స్థానిక జర్నలిస్టులు తమ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని తీర్మానించింది.  అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ లో వందలాది మంది జర్నలిస్టులతో ''ఛలో హైదరాబాద్'' కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గం ఢనిర్ణయించింది. ఈనెల 15 నుంచి అక్టోబర్ 25 వరకు ఫెడరేషన్ జిల్లా మహాభలు నిర్వహించి, నవంబర్ 21న రాష్ట్ర మహాసభలు జరపాలని ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళ స్థలాలివ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, కరోనా చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం ఇవ్వాలని, తెలంగాణ మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులలను, అక్రమ కేసుల బనాయింపులను ఆపాలని, దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, వి. జగన్, కార్యదర్శులు ఏవీఎన్ రావు, సలీమా, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపు రావు, మెరుగు చంద్రమోహన్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.