ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి "పట్టాభిషేక మహోత్సవం

Published: Saturday April 01, 2023
మధిర ,మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:ఆదర్శనీయ, ఆరాధనీయ, సర్వకాల సర్వస్థలోనూ ధర్మా చరణే లక్ష్యంగా, రఘువంశ తిలకడు, నిజాయితీ నిబద్దతలతో జగదానందకరంగా పాలన బాధ్యతలు నిర్వహించిన అలాంటి సాకేత సార్వభౌముడికి సామ్రాజ పట్టాభి షేకోత్సవాన్ని మధిర దివ్య క్షేత్రములో చైత్ర శుద్ధ దశమినాడు దేవాలయ అర్చకులు శ్రీనివాసుల శేషాచార్యులు నారాయణ చార్యులు చే అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినారు
కళ్యాణ రాముడిగా శ్రీరామనవమినాడు దర్శనమిచ్చే రాఘవడు, దశమినాడు పట్టాభిషేకం వేడుక నిర్వహించడం అంటే ప్రజలంతా ధర్మాచరణకు నిరంతర కట్టుబడి ఉంటామని ప్రతినబూనటం అలనాటి రామరాజ్యం మళ్లీ రావాలని ఆకాంక్షించడం, సౌమనస్యమైన పరిస్థితులని ఆహ్వానించడం ఈ పట్టాభిషేకమే ఈ వేడుక అని,ఈ పట్టాభిషేకం కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పల్లపోతు ప్రసాదరావు, చలువాది కృష్ణమూర్తి, చలువాది నరసింహారావు దంపతులు స్వామివారి పూజ పీఠల మీద అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రామాలయం కమిటీ చైర్మన్ పల్లపోతు ప్రసాదరావు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వామివారి సేవ చేయుటకు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని మరింత దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కమిటీ సభ్యుల సహకారం తో భక్తుల ఆర్థిక సహకారంతో దేవాలయానికి మరింత శోభను తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలకు నా శాయశక్తుల ప్రయత్నిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయం ఇన్స్పెక్టర్ సమత , కార్యనిర్వాహణాధికారి, వ్యాకరణగా విజయశ్రీ ,భక్తులు మాధవరపు నాగేశ్వరరావు, పుల్లఖండం సత్యనారాయణమూర్తి, వెచ్చా రంగారావు, సముద్రాల లక్ష్మీపతి, కపిలవాయి జగన్ మోహన్ రావు, తుమ్మలపుడి కృష్ణమూర్తి, కాలం వీరభద్ర రావు, దొడ్డా వెంకటనారాయణ,యర్రా లక్ష్మణ రావు, పల్లపోతు నరసింహారావు, పంతంగి శేషగిరి మామిళ్లపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.