ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *రైతులకు ఎలాంటి నోటీస్ లు ఇవ్వకుండా ఆన్ లైన్

Published: Tuesday November 15, 2022

మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూముల పూర్తి వివరాలు ఆన్ లైన్ లో పెట్టాలి అని ఉద్దేశంతో  2017 లో భూ రికార్డ్ సర్వే పేరుతో ప్రతి గ్రామంలో టెంట్ వేసి మరి భూ రికార్డ్ సర్వే కార్యక్రమం మొదలు పెట్టారు భూ రికార్డ్ సర్వే కార్యక్రమంలో కొంత మంది రైతుల సమస్యలు పరిష్కరం అయ్యాయి ఇంకా చాలా మంది రైతుల భూమి రికార్డ్ లు తారుమారు కవటమే కాకుండా ఆన్ లైన్ రికార్డ్ లో సక్రమంగా ఉన్న రైతుల భూమి వివరాలు ఏ కారణం చూపకుండా.స్థానికంగా ఉండే బ్రోకర్ల సహాయంతో ఎకరాల కొద్దీ పట్టా భూములు తొలగించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పై రైతులు మేము కబ్జాలో ఉన్నాం సాగు చేస్తున్నాం రికార్డ్ లో సక్రమంగా ఉన్న మా భూములను ఎందుకు ఆన్ లైన్ నుండి తొలగించారు మా భూములు సక్రమంగా ఆన్ లైన్ రికార్డ్ లొ పొందు పర్చి ధరణి పోర్టలో పెట్టాలని రైతులు తహసీల్దార్ అధికారులకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న ఇప్పట్టి వరకు రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు భూ రికార్డ్ సర్వే కార్యక్రమం మొదలు పెట్టి ఐదు ఏండ్లు గడుస్తున్నా ఇప్పట్టి వరకు రైతుల రికార్డ్ లు సక్రమంగా ఆన్ లైన్ చేయక పోవటం అధికారుల నిర్లక్ష్యమ ప్రభుత్వ నిర్లక్ష్యమ అర్థం కావటం లేదు అన్నారు ఈ విషయం పై రాజకీయ పార్టీల నాయకులు తహసీల్దార్ అధికారులను అడుగుతే డొంక తిరుగుడు సమాధానం చెప్పుతూ మా చేతిలో ఏమి లేదు పై నుండే ధరణి పోర్టల్ అప్సన్ బంద్ ఉంది అంటూ మీ సమస్య ఏమిటో ఈ సేవ మీ సేవ కేంద్రాల్లో 1500వందలు పెట్టి కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకోండి అని తహసీల్దార్ అధికారులు సమాధానం చెపుతున్నారు అయిన   ఈ సేవ కేంద్రలో దరఖాస్తు చేసుకొని కూడా నెలలు గడుస్తున్నా ఏ కారణం లేకుండా రికార్డ్ లో నుండి తొలగించిన భూములు సరి చేయటం లేదు ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి రైతులకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కబ్జా ల ఉండి సాగు చేసుకుంటున్న భూములు రికార్డ్ ల నుండి ఎకరాల కొద్దీ ఆన్ లైన్ నుండి తొలగించిన తహసీల్దార్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్ లైన్ రికార్డ్ లో భూమి కోల్పోయిన రైతుల భూముల దగ్గరకు వెళ్లి సర్వే చేసి కబ్జాలో ఉన్న రా లేదా గుర్తించి ఆన్ లైన్ రికార్డ్ లు సక్రమంగా చేసి ధరణి పోర్టలో పెట్టి రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులతో కలిసి పూర్తి ఆధారాలతో న్యాయం కోసం కోర్ట్ ని ఆశ్రయిస్తం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని హెచ్చరిస్తున్నాం*