ఈనెల 20 వరకు అక్రిడేషన్ దరఖాస్తు కు చాన్స్

Published: Thursday June 16, 2022
బోనకల్, జూన్ 15 ప్రజాపాలన ప్రతినిధి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కోసం ఈనెల 20 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జే యు) ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
 జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసే విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉందని దీంతో చాలామంది రూరల్ జర్నలిస్టులు అయోమయంలో ఉన్నట్లు యూనియన్ దృష్టికి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసే జర్నలిస్టులు అందరూ ఈనెల 20వ తేదీ వరకు ఆన్లైన్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర సమాచార శాఖ కల్పించిందని వారు గుర్తు చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉండే జర్నలిస్టులు సమాచార శాఖ కమిషనర్ పరిధిలోకి వచ్చే (స్టేట్)
జర్నలిస్టులకు మాత్రమే ఈనెల 15వ తేదీ వరకు చివరి గడువు గా విధించారని , జిల్లాల్లో ఉండే జిల్లా, మండల ,నియోజకవర్గ జర్నలిస్టులు అందరూ ఈ నెల 20 తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని ఈ విషయాన్ని అందరూ గమనించ వలసినదిగా వారు విజ్ఞప్తి చేశారు