ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Published: Friday August 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ లో జె.పద్మ 29వేలు, వి.విమల 60వేలు, యన్.నరసింహ 58, వేల రూపాయలు విలువ గల చెక్కులు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన చెక్కులను నాయకులు కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ, అంబాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.