ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మహాధర్నా

Published: Saturday December 24, 2022

జన్నారం, డిసెంబర్ 23, ప్రజాపాలన: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు  ఆధ్వర్యంలో జన్నారం కళాశాల విద్యార్థులతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పందిరి మనీష్ మహా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల  ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎబివిపి  జన్నారం శాఖ వివిధ కళాశాల   విద్యార్థులతో  మహా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పట్ల చూపిస్తూ నిర్లక్ష్యం వల్ల, పేద  విద్యార్థులు ఫీజు  రియంబర్స్మెంట్ రకా చదువుకి దూరం అవుతుందన్నారు. పేద విద్యార్థులు ఉన్నంత చదువు చదవాలని గవర్నమెంట్  హాస్టల్స్ లో సౌకర్యాలు సరిగ్గా లేక  ఫుడ్ పాయిజన్  కు  గురవుతున్నారు. వెంటనే గవర్నమెంట్ హాస్టల్  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తునమన్నారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్షల పాలన  కొనసాగిస్తే, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వాన్ని ఏ గద్దె ఎక్కించారో ఆ గద్దె దించడానికి తెలంగాణ లో  ఉన్న విద్యార్థులకు ఎక్కువ సమయం పట్టదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ పాలనలో ఇంతవరకు విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య పాలనని విద్యార్థుల పట్ల కొనసాగిస్తే ఎబివిపి విడిచిపెట్టదన్నారు. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న పాయిజన్ గురించి హైకోర్టు సిటిజన్ జడ్జి గారితో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో 300 గురుకులాలకు నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. పెంచిన ఇంజనీరింగ్ పేజీలు తగ్గించి ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పందిరి మనీష్, టౌన్ కార్యదర్శి బొప్పు నవనీత్, సోషల్ మీడియా ఇంఛార్జి అనిల్, నాయకులు విల్ల్సన్,రాజు,సాయికిరణ్ , సాయి రామ్, వివిధ కళాశాల విద్యార్థుల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.