పలు కాలనీలో మంచి నీటి సమస్య రాకుండా చూడాలి

Published: Friday February 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 9 వ డివిజన్ లో  ఉన్న  శ్రీరామ ఎంక్లేవ్ ఫేస్ వన్ కాలనీలో కృష్ణ మంచినీటి పైపులైను పనులను కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ కలిసి ప్రారంభించారు. మంచి నీటి సమస్య రాకుండా చూస్తామని అన్నారు.బండగ్‌పేట్‌ మేయర్‌
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని కాలనీల్లో మంచి నీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌లోని కాలనీల్లో సమస్యలను అంచెలంచెలుగా తీరుస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా  అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లో డ్రైనేజీ ఔట్‌లెట్లపైనా దృష్టి సారించినట్లు  చెట్లు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కాలనీల వాసులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ గూడెపు ఇంద్రసేన, కో ఆప్షన్‌ సభ్యులు మర్రి జగన్మోహన్‌ రెడ్డి, డీ.ఈ అశోక్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కాలనీ అధ్యక్షులు గడ్డం మల్లారెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.