తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పోచమోని జంగయ్య... సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోడ సామెల్

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం లోని పాషా నరహరి స్మారక కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పోచ మోని జంగయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ  సామెల్ గారు మాట్లాడుతూ... మంచాల మండలం బండ లేముర్ గ్రామంలో జన్మించిన కామ్రేడ్ పోచమోని జంగయ్య గారు  పోచమోని రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు 4సంతానం గా జన్మిచారన్నారు. ఈ యన నిరుపేద కుటుంబంలో జన్మిచారన్నారు. కామ్రేడ్ పోచమోని జంగయ్య గారు గొర్ల మేపుతూ జీవనం సాగిస్తూ అమ్మ నాన్నలకు సహాయంగా ఉండేవరన్నారు. కామ్రేడ్ పోచమోని జంగయ్య చిన్నతనంలోనే తాడేపల్లి గూడెం నుండి పెళ్లి చేసుకున్నరన్నారు. నాటి నైజాం సర్కారు, భూస్వాములకు వ్యతిరేకంగా భూమికోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నైజం సర్కారుకు వ్యతిరేకంగా కామ్రేడ్ కాచం కృష్ణ మూర్తి, కామ్రేడ్ భీంరెడ్డి నర్సింహా రెడ్డి, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం, కామ్రేడ్ గడ్డి లింగయ్య, కామ్రేడ్ ఎలమంద, ఇలా అనేక మంది కామ్రేడ్స్ చేస్తున్న భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం  తిరుగుబాటు చేస్తుంటే ఆకర్షితులై వీరితో పరిచయం ఏర్పడి తానుకూడా ఆ పోరాటంలో  చేరి నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా రాచకొండ లో స్తావరాలు  ఏర్పార్చుకొని నైజం సర్కారుకు వ్యరహిరేకంగా పోరాటాలుచేసి పేద ప్రజలకు వేల ఎకరాలను పంచిపెట్టారని గుర్తు చేసారు. అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. జగదీష్ , సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి .సిహేచ్ జంగయ్య , సిపిఎం నాయకులు ఎ. వెంకటేష్, మున్సిపల్ కార్యదర్శి  శిహెచ్ ఎల్లేష్ ,  డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షలు కోట రవి , ఎస్ఎఫ్ఐ  కార్యదర్శి బి, శంకర్ , కే వి పి యస్   ఇబ్రహీంపట్నం అధ్యక్ష, కార్యదర్శి సీహెచ్ జ్యోతి బాసు, యం. ఆనంద్  సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ సిహెచ్. బుగ్గరాములు  సిఐటియు నాయకులు బి. యాదగిరి , నాయకులు దాసు, రవి, చిన్న, తదితరులు పాల్గొన్నారు.