మేడి వెంకయ్య కుటుంబానికి 5000/రూ ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ భాగం శ్రీనివాసరావు

Published: Friday January 28, 2022
బోనకల్, జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం ఏ గ్రామంలో గ్రామస్తుడైన మెడి వెంకయ్య ఇటీవల మరణనించడంతో గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. అనంతరం మరణించిన మేడి వెంకయ్య కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో సర్పంచ్ భాగం శ్రీనివాసరావు స్పందించి 5000/-రూ తమ సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసినారు. ఈ కార్యక్రమంలో  మోటమర్రి సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కావూరి శంకరయ్య, భాగం సాయి ప్రసాద్, గ్రామపంచాయతీ వర్కర్స్ ధార సురేష్, బూసి పోగు శ్రీనివాసరావు, ఇసరం ఉద్ధండు తదితరులు పాల్గొన్నారు.