దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాద : సిపిఎం

Published: Thursday February 03, 2022

ఇబ్రహీంపట్నం పిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం మండల కార్యదర్శి జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్ సభలో 39లక్షల 44వేల 909 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అనేక సంక్షేమ పథకాలను విస్మరించి కార్పొరేట్లకు 12 శాతం పన్నుల్లో రాయితీ ఉంటే దానిని ఇప్పుడు 7 శాతానికి తగ్గించి ఆదాని, అంబానికి ఊడిగం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని వారు విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆపేందుకు ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 73 వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 50వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఉపాధి హామీ పథకంపై నేరపూరిత దాడి అని అన్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ప్రజా ఆరోగ్యం పట్టించుకోకుండా కనీస కరోనా అత్యవసర సేవలకు నిధులు కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. విద్యారంగానికి గత కమీషన్లు బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయించాలని చెబుతున్న కేవలం  3శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాటలు కోటలు దాటుతున్నవి తప్ప ఆచరణ మాత్రం గడప దాటడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడ్జెట్లో సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గరాములు, జగన్, లింగస్వామి, నాయకులు యాదగిరి, వీరేశం, రాఘవేందర్, శంకర్, స్వప్న, విజయమ్మ, సుమలత, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, చరణ్, తరంగ్ తదితరులు పాల్గొన్నారు