రైతులను అయోమయానికి గురి చేస్తున్న కేసీఆర్ : బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగా రెడ్డి

Published: Monday December 20, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 19, ప్రజాపాలన : యసంగి పంటల విషయంలో రైతులను ముఖ్యమంత్రి కేసిఆర్ అయోమయానికి గురిచేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగా రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేతగాని తనం వలన రైతులు ఏ పంట పండించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి మూడేళ్ళైనా అమలు చేయలేదని అన్నారు. అదే విధంగా పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే ఫసల్ భీమా యోజన అమలు చేయకపోవడంతో రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని  అన్నారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు జిల్లా అభివద్ధి పై దృష్టి పెట్టకుండా భూ కబ్జాలు, అవీతిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ వైఫల్యాలను రైతులు గమనిస్తున్నారని , రాబోయే ఎన్నికల్లో రైతులు టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రజినిష్ జైన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు పెద్దపల్లి పురుషోత్తం అరుముల్ల పొషం, వెరబెల్లి రవీందర్ రావు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, రేకమందర్ వాణి, జోగుల శ్రీదేవి, మధవరపు రమణ రావు, బొద్దున మల్లేష్, తుల మధుసూధన్ రావు, బోయిని హరి కృష్ణ, గాజుల ప్రభాకర్, సోమ ప్రదీప్ చంద్ర, బల్ల రమేష్, మిట్టపల్లి మొగిలి తదితరులు పాల్గొన్నారు.