మాటూరుపేట పీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డేకనిపించే దేవుళ్ళు డాక్టర్లు.గడ్డం సుబ్బారావు మధిరజ

Published: Friday July 01, 2022

మండలం పరిధిలో శుక్రవారం నాడు మాటూరుపేట గ్రామంలో గడ్డ సుబ్బారావు ఆధ్వర్యంలోనేడు డాక్టర్స్ డే సందర్భంగా మాటూరుపేట సీతారామాంజనేయ కళా పరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ వెంకటేష్, ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీనివాస్కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.కరోనా మహమ్మారి లాంటి సమయంలో ప్రజలకు తమ సేవలను అందించిన ఘనత డాక్టర్లదేనని ఈ సందర్భంగా అన్నారు.కనపడే దేవుళ్ళు డాక్టర్లని, వారి సేవలను మాటల్లో చెప్పలేమని, తల్లి జన్మనిస్తే  జీవితానికి పునర్జన్మ కల్పించడం వారు వల్లే సాధ్యమేనని, డాక్టర్లకు ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ వెంకటేశ్వరరావు, చిలువేరు బుచ్చిరామయ్య, చిలువేరు శాంతయ్య, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.