పల్లె ప్రగతిపట్టణ ప్రగతి హరితహారం సమీక్ష సమావేశం

Published: Saturday June 19, 2021

మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మధిర శ్రీరస్తు ఫంక్షన్ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు, అలాంటి పల్లెటూర్లు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రత్యేక శ్రద్ధతో అనేకమైన వసతులను పల్లెటూర్లకు ఏర్పాటు చేస్తున్నారని, ఈ పీరియడ్ లో సర్పంచ్ చేసేవారు వారి గ్రామాల్లో జరిగే అభివృద్ధి వలన గ్రామపంచాయతీ చరిత్రలో నెంబర్ వన్ సర్పంచ్ గామిగులుతారు ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామలు, సిసి రోడ్లు డ్రైన్లు,మల్టీపర్పస్ వర్కర్లు తో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధిని మన తెలంగాణ గ్రామాల్లో చూపిస్తున్నారని, అనేకమైన వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఏకమై రానున్న వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల నీటిని ఉపయోగించుకుని ఎటువంటి డెంగ్యూ లాంటి రోగాల బారిన పడకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయలని పల్లెలు శుభ్రంగా ఉంచుకుని ప్రజలందరూ, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సుఖ సంతోషాలతో గడపాలని అన్నారు, పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలవకుండా, డ్రైన్లు, రోడ్లపై చెత్త వెయ్యకుండా అధికారులు చురుకైన పాత్ర పోషించి నగర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, ఎంపీపీ మెండేo లలిత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు బాబు, డాక్టర్ వెంకటేష్, ఈవో ఆర్ డి రాజారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రెటరీ లు, సొసైటీ అధ్యక్షులు, ఫారెస్ట్ అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు తదితరులు హాజరయ్యారు.