దేవీ నవరాత్రి ఉత్సవాలకు పోలీస్ అనుమతి తీసుకోవాలి రూరల్ ఎస్ఐ

Published: Saturday September 24, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధిమండలంలోని ప్రజలు దేవినవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మధిర రూరల్ ఎస్.ఐ నరేష్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో మండపాలు, పందిళ్ళు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. దేవినవరాత్రుల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేవారు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతులు పొందాలని ఆయన అన్నారు. దేవి విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.విగ్రహ ప్రతిష్ట నాటి నుండి ఎన్ని రోజులపాటు పూజలు జరుపుతున్నారో, నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో వాటికి సంబంధించిన వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని ఆయన కోరారు. విద్యుత్ శాఖ మరియు స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత స్థలం యజమాని నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.మండల ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.