ఇళ్ల పట్టాలు ఇచ్చేవరకు భూ పోరాటం ఆగదు* - సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి*

Published: Wednesday February 22, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 21, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు భరోసాగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడిసెలు వేసుకున్న నిరుపేదలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చేంత వరకు పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని గతంలో కూడా చేవెళ్ల పట్టణ కేంద్రంలో 200 ఇండ్లు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాడి ఇండ్ల పట్టాలు సాధించుకున్నామని అదేవిధంగా ఇక్కడ కూడా పోరాడి ఇండ్ల పట్టాలు సాధించుకుంటామని పేదల పక్షాన నిలబడి వారికోసం ఎన్ని కేసులు అయినా భయపడము అని జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఒక ప్రకటనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రబలింగం రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే ఏం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి షాబాద్ మండల కార్యదర్శి జంగయ్య రుక్కయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్ గీత పనివాళ్ల  సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ రాములు గౌడ్  లక్ష్మణ్ గౌడ్ ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివయ్య మండల మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల విజయమ్మ సాయిలమ్మ తదితరులు పాల్గొన్నారు