దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జన్మదిన శుభాకాంక్షలు

Published: Thursday March 25, 2021

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : హోరాహోరి లో దుబ్బాక ఎన్నికల్లో నూతన నాంది పలికి ఎమ్మెల్యే గా గెలిచిన రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి 29 వ డివిజన్ కార్పొరేటర్ నీలా రవి నాయక్ (దంపతులు) రఘునందన్ రావు నివాసంలో కలిసి కేక్ కట్ చేసి పూల బుగ్గే ఇచ్చి శాలువాలతో సన్మానించి ఇలాంటి జన్మదిన వేడుకలు 100 పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ..... బీజేపీ కార్యకర్తలు ఎల్లవేళలా  రామదండుల నా వెంబడి ఉన్నంతవరకు అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయాన్ని నిలబడతానని ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు యువకులు నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.