ఘనంగా గర్ల్స్ ప్రైమరీ స్కూల్ మధిర నందు ఫేర్వెల్ డే వేడుకలు

Published: Wednesday April 19, 2023

మధిర ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి:బాలికల ప్రాథమిక పాఠశాల నందు మధిరలో ఫేర్వెల్ డే అత్యంత ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగినది అందుకుగాను పిల్లలను పాఠశాల సిబ్బంది అభినందించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మధిర మండల విద్యాధికారి వై ప్రభాకర్ పాల్గొని పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు గురువులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి | తన కాళ్లపై తను నిలబడాలని అంతేకాక మరొకరికి సహాయ సహకారాలు అందించే స్థాయికి ఎదగాలని సమాజంలో మంచి పౌరులుగా తయారవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నారాయణ, నోడల్ ఆఫీసర్ దీన్ దయాల్ , గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్. స్వప్న , పాఠశాల ప్రధానోపాధ్యాయులు యరముల కోటారెడ్డి, ఎస్. ఎం.సి చైర్మన్ కే. ప్రకాష్ రావు, వార్డు కౌన్సిలర్ నాగ సులోచన , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు రామకృష్ణ , రాజ్యలక్ష్మి , ఆఫత్ జాహ, శోభరాని, పి. నాగమణి, సి హెచ్. నాగమణి, శిరీష, రమణ తల్లిదండ్రులు పాల్గొన్నారు.