ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Published: Tuesday April 20, 2021

మధిర, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలో లోమహిళా సమాఖ్యల ఆద్వర్యంలో APM రాంబాబు బీరవల్లి అధ్యక్షతన మధిర మండలం నందు గల సిరిపురం, వంగవీడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రాలను మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీ చిత్తారి నాగేశ్వర రావు, MPP శ్రీమతి లలిత ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణా ప్రభుత్వం రైతులకు అందించి, అండగా వుంటుందని కొనియాడారు. రైతులందరూ వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో మాత్రమె అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, 45 సం. పైబడిన వారందరికి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ నందు ఉచితంగా కరోనా వాక్సిన్ వేస్తున్నారని, దానిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అదే విధంగా ప్రజలందరూ మాస్కులను ధరిస్తూ, బౌతిక దూరాన్నిపాటిస్తూతమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటి చైర్మన్ చావా వేణు, ఆత్మా కమిటి చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, సిరిపురం, వంగవీడు గ్రామాల సర్పంచ్ లు, MPTC లు,  గ్రామ పెద్దలు, సెర్ప్ సిబ్బంద