మల్లాపూర్ లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం

Published: Monday July 26, 2021
మల్లాపూర్, జులై 25 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయం యందు మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏనుగు రాంరెడ్డి అధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి క్లబ్ సభ్యులు తీర్మానించారు. భవిష్యత్ లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాల ప్రణాళిక రూపొందించడం జరిగింది. అనంతరం లయన్ సభ్యులందరూ కలిసి మొక్కలు నాటారు. అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ గ్రామాన లయన్స్ క్లబ్ సేవలను విస్తృతంగా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సాధుల వెంకట స్వామి, బొయిని సిద్దయ్య, మాజీ జెడ్సి శివ శ్రీనివాస్, ఛటర్ ప్రెసిడెంట్ దేవ మల్లయ్య, మాజీ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, పిఆర్ఓ ముత్యాల రమేష్, లియో క్లబ్ ముస్కరీ రాహుల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.