నేడు బోనకల్ లో పొంగులేటి క్యాంపు కార్యాలయం ప్రారంభం

Published: Saturday April 08, 2023

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని నాగర్జున గ్రామీణ వికాస్ బ్యాంకు ఎదురుగా నిమ్మల సైదయ్య (లేటు) కాంప్లెక్స్ నందు పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయం శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు పొంగులేటి అనుచరులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 09.30గంటలకు ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.