వైరాలో జరుగు గిరిజన సంఘం రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయండి.

Published: Wednesday April 13, 2022
వైరా :భూక్యా వీరభద్రం :-12-4-2022, రాష్ట్రంలో గిరిజనుల సమస్యలపై భవిష్యత్ పోరాటాల రూపకల్పన చేయడం కోసం ఈనెల 24, 25.న వైరా కేంద్రంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశాలు జరుగుతాయని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు గిరిజన సంఘం వైరా నియోజకవర్గ సమావేశం స్థానిక బోడేపూడి భవన్ లో జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన జనాభా 10 శాతం పైబడి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా కాలయాపనతో గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు పోడు భూములు సాగు చేసిన గిరిజనులు పెద్దలు ప్రజలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులతో దాడులు చేయించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వైరాలో గిరిజన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు గిరిజన సంఘం రాష్ట్ర సమావేశాలు విజయవంతం కై అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు, సమావేశంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా కృష్ణా నాయక్ నియోజకవర్గ నాయకులు తేజావత్ సీత రాములు తేజావత్ కృష్ణ కాంత్ బానోతు హరిచంద్ రాము తదితరులు పాల్గొన్నారు