కార్పొరేషన్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం : మేయర్

Published: Tuesday August 10, 2021
బాలాపూర్: ఆగస్టు 9, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి కాలనీలో కాలనీవాసులు శుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, దోమలు పుట్టకుండా, కుట్టకుండా నివారణ చర్యలతో పరిసరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోనీ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో 17వ, 20వ, 21వ, 29వ, పలు డివిజన్లలో సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించి, సిసి రోడ్డు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. 17వ డివిజన్ లో శివాజీ చౌక్ వద్ద హరితహారం, 20వ డివిజన్ లో అన్నపూర్ణ కాలనీలో మొక్కలు నాటారు, 21వ డివిజన్ భీష్మ నగర్ లో కాలనీ వాసులతో కలిసి అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యం గా తెలంగాణా ప్రభుత్వం హరితహారం లో భాగంగా పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందిని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం పెంపొందించి, శుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని అన్నారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. 29వ డివిజన్ లోని సీతా మెడస్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ లు బిక్కు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బంగారు అనిత ప్రభాకర్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.