*అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.*

Published: Saturday February 04, 2023

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 03, ప్రజాపాలన : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలని దుంపల రంజిత్ కుమార్   సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రోజున మంచిర్యాల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించి అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచింది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇచ్చే విదంగా అసెంబ్లీ లో బడ్జెట్  పెట్టాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల రాజీవ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దాసరి రాజేశ్వరి, గోమస ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ఎం.రాజ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ప్రేమ్ కుమార్, శేఖర్, డివైఎఫ్ఐ నాయకులు,ఎం. తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, డి.మోహన్ కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి, అభినవ్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి, తస్లిమ, సుల్తానా, పూజ, రమ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.