తెలంగాణ రాష్ట్రనుంచి ఎంపిక చేయబడిన, ఆదర్శ చెఱకు రైతు మంకెన వెంకటేశ్వర రావు

Published: Tuesday September 21, 2021
పాలేరు, సెప్టెంబర్18, ప్రజాపాలన ప్రతినిధి : మధుకాన్ సుగర్స్ అభ్యుదయ చెఱకు రైతు, శ్రీ మంకెన వెంకటేశ్వర రావు, చెన్నారం వాసిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) మరియు హార్టికల్చర్ అసోసియేషన్ ఆ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన "ఊద్యానవనం సహ వ్యవసాయంలో నీటి ఉత్పాదకతను పెంచస్థానికి విన్నూత విధానాలపై గ్లోబల్ కాన్ఫరెన్స" సందర్భముగా నిర్వహించిన అభ్యుదయ రైతుల ఎంపికలో, తెలంగాణ రాష్ట్రం నుంచి, చెఱకు అభ్యుదయ రైతుగా ఎంపిక చేసినందుకు, మధుకాన్ సుగర్స్ యాజమాన్య మరియు  అందరి రైతుల నుండి అభినందనలు తెలియచేస్తున్నాము. శ్రీ మంకిన వెంకటేశ్వర రావు గారు చెఱకు సాగులో ఆధునిక సేద్యపద్దతులైన, బిందు సేద్యం (Drip Irrgation), ఎడంగా జంటచాళ్ళులో నాటడం, చెత్త తగులపెట్టకుండా చేలో పరవటం (Trash Mulching)వంటి మంచి నీటి ఉత్పాదకతను పెంచస్థానికి విన్నూత విధానాల నీటి యాజమాన్య పద్ధతులను  అవలంభిస్తూ చెఱకు అధిక దిగుబడులు సాదించినందుకు ఎంపిక చేయబడి, PJTSAU, రాజేంద్రనగర్ లో 18.09.2021 న నిర్వహించిన గ్లోబల్ కాన్ఫరెన్స సందర్భముగా సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రనుంచి ఎంపిక చేయబడి, ఆదర్శ చెఱకు రైతు మొమెంటో, సన్మాన పత్రం అందచేశారు.